ఆదిత్యులు
ఏమిటా చప్పుడు
ఏడుపులు పెడబొబ్బలు
ఆ తగలబడేవి
దళితుల గుడిసెలు
ఆ వీధుల్లో పారేది
అది వాళ్ల రక్తమే
ఓఫ్ ఎంత దౌర్జన్యం
ఎంతటి నరమేధం
వాళ్లెవరో కాదు
ఈ దేశపు ఆదివాసులు
ఈ నాగరికతకు మూలజనులు
అంతేకాదు
పంటలు పండించేది వాళ్లే
పాడె కట్ట తెచ్చేది వాళ్లే
వాళ్లే తిరగబడితే
ఊళ్లకు ఊళ్లే ఉప్పెనలై లేస్తాయి
దేశ చరిత్రే మారిపోతుంది సుమా












Click it and Unblock the Notifications