ఒక పాళీ - కొన్ని దృశ్యాలు
శిఖరాల అంచులపై రెక్కలపై విహరిస్తూ
లోయ లోతుల్లో పాదాలమై కలియ తిరుగుతూ
కొన్ని నిజాల్లాంటి ఊహల మధ్య
కనురెప్పలు మూసుకున్నా కనబడే దృశ్యాలు కొన్ని
నన్ను నేను వెతుక్కుంటూ
మరో బతుకులోకి తొంగిచూస్తూ
కాలుతూ.... రాలుతూ....
పగలబడి నవ్వుతూ...
కడలి మీద మరో సముద్రమై విస్తరించి
పరవళ్లు తొక్కుతూ తీరం దూకే కెరటాలు
మరో వైపు సముద్రంతో పోటీ పడుతున్న జనప్రవాహం
కెరటాల కన్నా వేగంగా మైదానాలను కబళిస్తున్న గృహ సముదాయాలు
ఓపికున్న భూమి అటూ ఇటూగా బద్దలై
అన్ని ప్రయోగాలను తనలో ఇముడ్చుకుంటున్న దృశ్యం
స్విస్ ఖాతాలు .... ఆకాశహర్మ్యాలు....
అంతరిక్ష కేంద్రాలు ... నాదీ నాదనుకున్న సమస్తం
చిత్రగుప్తుడి చిట్టా ముందు
అవినీతి రాజకీయం - అన్యాయపు న్యాయవాది
కేసు గెలిస్తే యముడింటికి సఫారీ కారు
మధ్యవర్తికి ఇండికా నజరానా












Click it and Unblock the Notifications