వా వూర్లెకు రా
అప్రియ స్నేహితురాలా
పైటను తగిలేసిన సాహసికురాలా
మా వూర్లెకు రా
పైటను నడుముకు చుట్టి
విత్తనాలేస్తున్న మా అమ్మను చూద్దువు గానీ
(మీ గురించి గానీ, అంతకు ముందే బ్రాల్ని వదిలేయండన్న వాళ్ల గురించి గానీ ఆమెకు తెలియదు)
అపరిచిత సాహితీ ప్రియురాలా
తాళి కాదు
గుండెలు ప్రధానమన్న ప్రయోగకురాలా
నువ్వు కూడా
మా వూర్లెకు రా
పెండ్లి లేకుండా
పిల్లను కనిపెంచుతున్న మా మంగమ్మను చూద్దువు గానీ
(పై విధంగా నీనా గుప్తా గురించి గానీ మరేది గాని తెల్వనే తెల్వదు)
ఒక పఫ్పూ రెండు పెగ్గులూ
ఆధునికానంతరమనే పబ్బు గర్లూ
నువ్వు తప్పక మా వూర్లెకు రా
కొడుకుతో చుట్ట ముట్టించుకొని
మనవడితో గిలాస వొంపించుకున్న
మా నాయనమ్మను చూద్దువు గానీ
Don't say that you are advance
ఆకాశం ఎప్పుడూ ఉండును
మేఘాలు ఎప్పుడు ఎలా ఉండునో
ఆకాశానికి తెలువదు












Click it and Unblock the Notifications