తావు
పిల్లర్లు లేని మండపం
కప్పని పందిరి
కట్టని గోపురం
వేయి స్తంభాలుగా
ఊడలు దిగి
తంతెలు తంతెలుగా
వానాకాలం విచ్చుకున్న ఛత్రీ
ఎండకాలం చల్లని ఎ.సి. రూం
చలికాలం నులివెచ్చని గొంగడి
పడుచుదనం
తూగుటుయ్యాల
గోగునార నులకయ్యినట్లు
గాలికి కొమ్మలు కలె మెలిగినట్లు
రెమ్మలు తాకి
చిగుర్లు రాలి
అక్కడే...
దుశేర్ తీగెలు శిబ్బులయ్యేది
వేర్లల్లుకున్నట్లు
ఊడలల్లుకున్నట్లు
వరుస మొదలెక్కడో
వరస కొస ఎక్కడో
రాలిన పండ్ల వాసన
ఆత్మగల అల్లికలు
అక్కడే...
అతుకు గనబడకుంట
ఆరు పురుల ఆండ్రేసినట్లు
కూలబడ్డోల్లంతా నిలబడ్డట్లు
అక్కడే...
ఏముదన్నదక్కడ
కుండీలోకి
కుండీలాంటి నగరంలోకి
చెట్టూ
చెట్టులాంటి
చెట్టులాంటి మనిషి
శవం ముందు జాగరణోతిగ
కూసోలేదు












Click it and Unblock the Notifications