ఫకీరు
పాలపర్తి ఇంద్రాణి
చిలుం పీలుస్తూ పారవశ్యంలో మునిగిన ఫకీరు
మా ఇంటి వెనక నిద్ర మత్తులో జోగుతున్న
పంట కాలువ
నగర సంకీర్తన చేస్తున్న భజన భక్త బృందం
కాలువ గట్టు మీద అటూ ఇటూ వూగుతున్న
చెట్ల వరుస
గుడి మెట్ల మీద ఒకే పాట పదే పదే పాడుతున్న బిచ్చగాడు
గట్టు మీద గడ్డిలో దాక్కుని ఆరుస్తున్న
కీచురాయి
ఏళ్ల తరబడి సాష్టాంగ పడి తపస్సు చేస్తున్న భక్తురాలు
పంట కాలువ మీద అడ్డంగా పడి ఉన్న
తాటి బద్ద వంతెన
నడి రాత్రి ఫకీరు ముందు కూర్చుని చీకటిని తాగుతూ నేను












Click it and Unblock the Notifications