ఎవరూ...
ఈ రాత్రి ఎవరూ దొరకరా
అపరాత్రి ఎవరు మేల్కొంటారు
పొద్దు వెంట వచ్చిన చీకట్లో అలసి సొలసిన
నా దేహం ఇప్పుడే మేల్కొన్నది
పొద్దుట్నుంచి అలసి సొలసిన
మీ దేహం ఇప్పుడే మలిగినట్లున్నది
రోజంతా రాజీపడి పడీ
ఇప్పుడే ఘర్షణకై లేచిన
పొద్దస్తమానం పనిలో పడి
ఇప్పుడే నెమ్మది పడుతుండొచ్చు మీర
ఇంత రాత్రి ఎవరు దొరకతరు
ఒక రిక్షానా
ఒక క్వార్టరా
ఒక మిత్రుడా
ఒక వేశ్యనా
ఎవరూ ఎవరికీ దొరకరు
దొంగలో పోలీసులో తిరిగే వేళ
మనుషులెక్కడ దొరుకుతారు
బరాల్ ఈ రాత్రి ఎవరూ దొరకరు
నా భుజాన్ని జర సేపు ఆన్చటానికి
ఒక్క ఆనుగర్రయినా....












Click it and Unblock the Notifications