జ్ఝాపకాలు

ఏకాంతపుటాలోచనల అరణ్యంలో
నన్ను నేను పారేసుకుంటానా -
నీ జ్ఞాపకాలు గీరుకుపోయి గాయాలు చేస్తాయి
జ్ఞాపకాలు
తొలి వానచినుకుల సెంటు పూసుకున్న నేల విరజిమ్ముతున్న వాననై
కొత్తగా నేను కొనుక్కున్న పుస్తకపు పేజీ మడతలు వెదజల్లుతున్న వాననై
వర్షం కురుస్తున్న సాయం సంధ్యలో స్నానమాడుతున్న అనుభూతై
గుండె గొంతుల్లో దిగిపోతాయి
అనుభవం లేని నా జీవన అనుభూతులై
నా బాహు బంధాల్లో ఒదిగిపోతాయి
ఇక్కడ,
అక్షరాలు, మాటలు, పాటలు, పదాలు
నీ జ్ఞాపకాల్ని నింపుకొని బరువెక్కినాయి












Click it and Unblock the Notifications