పావురం

ఎక్కడా వాలదు
మన చేతుల్లోనే ఉంటుంది
ప్రపంచమంతా తన తరంగాలతో చుట్టి వస్తుంది
ఎక్కడి నుంచో వచ్చి
మన భుజం మీద వాలదు
మన మణికట్టు మీద ఆనదు
మన చేతిలో ఉంటుంది
సముద్రాన్ని డిజిటలైజ్ చేసి మన చెవిలో వేస్తుంది
ముద్దొచ్చే చిట్టి పావురం
చేతిలో ఇమిడే హార్మోనియం పెట్టె
విల్లూ బాణమూ కనిపించని లేఖాస్త్రం
ఆరవ జ్ఝానేంద్రియం
చర్మానికత్తుకోని దేహ భాగం












Click it and Unblock the Notifications