చినుకులు

గట్టుకొని ఎదురు చూస్తుంది
వూరి సుట్టు గుట్టలు
ఆకాశాన చంద్రుడు చుక్కలు
చంద్రుడు సిల్లం కల్లమైండా
సుక్కలే కుప్ప గూడి ముద్దయినయా...
వాగు ఎండు డొక్కయింది
పొంగుతున్న బొగ్గు గనులు
ఏ బాంచలకు బాంచ చరిత్రల
సమాధుల చీకటి పొరలో...
గ్రేటర్ పటాల్లో
కాట గల్సిన పల్లె పక్షికి
పట్నాల సమిటి కొమ్మలు
సందు బుట్టనిస్తయా
కొండ సుట్టూర బండలు
ఎన్నడూ నీళ్లకై లేవని
ఆవుల మందలు
బాల కార్మికులు
చెమట చెత్త కుప్పల్ల
పలిగిపోయిన
అక్షరాల పలకలు












Click it and Unblock the Notifications