మాట స్వచ్ఛం

సమ్మోహనాస్త్రం
రంగు రుచి వాసన
మాటంటే
పచ్చని చెట్టు కింద ఒట్టు వేయడం
మాటంటే దేవుని గుడిలో ప్రమాణం చేయడం
మాటంటే నాలుక మీద నిప్పు రవ్వ
మాటిచ్చి మలువుకున్నవు
మాట నీకు అంగడి సరుకు
నీళ్లు నములుతవు
తొత్తిరి తొత్తిరి మాట్లాడతవు
నవంబర్ ఒకటిని
మా నెత్తి మీద గుది బండను చేస్తవు
దింపుకుందామంటే
దినమొక్క వేషమేస్తవు
నీతి లేదు, నియ్యతు లేదు
పోరా నాయనా, పో
పొమ్మనలేక పొగ పెట్టలేం
ఉండుమని తూగుటుయ్యాలలు ఊపలేం
యాభై ఏళ్ల తప్పుడు మాటల కూతలు వినలేం
పోరా అయ్యా, పో
మా బతుకునెంచే వాడు
మాకు బుద్ధులు చెప్పేవాడు
బెత్తం పట్టుకుని బెదిరించేవాడు
మాకొద్దు గాక వద్దు
నీ ఉద్దరింపు వ్యూహాలు
మాకీ ఊడిగాలు వద్దు
పోరా, అయ్యా పో
కోపం కోటి గొంతుకలవుతున్నది
నువ్విక ఉండలేవు, ఊసులు చెప్పలేవు
పోరా, నాయనా పో












Click it and Unblock the Notifications