కొయ్య కన్ను

ఆ కర్ర చప్పుడు
నా వెనక నీడలాగా
తెరుచుకునే వున్న అతని చూపు కింద
ప్రపంచం వొక శూన్యపు గులక రాయి
గిరగిరా తిరుగుతూనే వుంటుంది
అనేకార్థాల
అనేక వర్ణాల చక్రంలాగా
అతని కళ్ల కింద పొందిగ్గా
వొదిగి కూర్చున్న వాటి అర్థాల కోసం
వెతుక్కుంటూ వుంటాను
అసలు అర్థం ఏమిటా అని
అదే పనిగా శోధిస్తూ వుంటాను
ఈ లోపు అతను రోడ్డు దాటి వెళ్లిపోయాడు
నేను రోడ్డు మధ్యలో
చిక్కుబడి పోయాను
కొయ్యబారిన కన్నుతో












Click it and Unblock the Notifications