స్వప్నశకలం

Kavitha
కల కన్నీరై కళ్లలోకి జారింది
కన్నీటి జడిలో విరిగి
తడిసి ముద్దైన కలల శకలాల్ని ఏరి
ప్రేమ నీరెండలో ఆరబెట్టాలనుకుంటే
ప్రేమ ఎప్పుడూ దోబూచులాడుతుందెందుకో
ఒకసారి విశ్వమంతటా తానున్నానని
మరోసారి అనంత శూన్యాన్నని
తన భయద సౌందర్యంతో
దిగ్భ్రమకు గురి చేస్తుంది
ఒకసారి తన సురక్షిత హస్తాలతో
అపురూపంగా లాలిస్తుంది
మరోసారి కనిపించని
కదలనివ్వని బంధనమై చుట్టేస్తుంది
మనసు గుప్పిలి విప్పడం కాదు
చుట్టూ పరుచుకోవడం కావాలి చెదిరిన కలకి
కన్నీటి కెరటాలని కంటి తీరాలు
చాటనివ్వని కనురెప్ప కావాలి విరిగిన కలకి

స్వప్న ప్రాంగణంలోకి
అడుగిడబోయే అతిథి ఎవరైనా
హృదయ స్తబ్దతని ఆర్ద్రం చేసే
వెచ్చటి ప్రేమ కిరణమొకటి
వెంట బెట్టుకు వస్తే బాగుండునని
వేచి చూస్తుంటుంది గడ్డ గట్టిన కల

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+