చెంచు కుర్రాడు

జేబులో పోసుకుని
నా వంతు మోసం నేనూ చేద్దామని
బయల్దేరాను
బాట పొడుగునా మట్టి మీద
సూర్యుని వెచ్చని ముద్దల్లా
పొద్దుటి ఎండ
ఇదే దారి ఇలాగే వెళ్లు
అని చెబుతున్నట్లు
బాటకు అటూ ఇటూ రకరకాల చెట్లు
పెట్టల చుట్టూ కోడిపిల్లల్లా
చెట్ల చుట్టూ ముడుచుకుంటున్న పచ్చిక బయళ్లు
గడ్డిపువ్వుల మీద
ఆరాటంగా ఎదుగుతున్న అద్దం రెక్కల తూనీగలు
ఈ చల్లని వుదయం
రైల్వె గాజులపల్లెలో చింత చెట్టు కింద
చెంచు కుర్రాడు ఎక్కుపెట్టిన విల్లు
ఎటు తిరిగితే అటు తిరుగుతూ
నన్నే చూస్తుంది. దాని సౌందర్యం హాంట్ చేస్తుంది
చెంచు కుర్రాడు నిర్మోహి
ఎన్ని అందాలు ఊరించినా గురి మరువడ
ధనుర్భంగం చేయడు
నేనూ లేనూ
అతని ధనుర్బంగం చేయడానికి
చెంచు కుర్రాడు విద్రోహి
ధనుర్భంగమైనా
ధర్మభంగం చేయడు
నేనూ లేనూ
అతడి ధర్మభంగం చేయడానికి
ఆ కుర్రాడు ఓడిపోతాడు కాని వాడిపోడు
నా లోపలి బురదలోంచి మొలకెత్తుతూనే వుంటాడు












Click it and Unblock the Notifications