ఉద్యమం ఆగబోదు

శిరముపైన మోపినాడు
ముఖ్యమంత్రి భస్మాసురుడు
ముచ్చటగా తన చేతులు
మోహిని అవతారమెత్తి
సాహసించి పాటి వనరు
కానరాక తల్లడిల్లు
కాడెద్దుల బలగమంత
పార్టే దేశము అనుకొను
పాటేది విజ్ఞత అంతయు
ముఠాదే రాజ్యమ్మను
శఠం గూర్చు ఫలితమ్మిది
పార్టీవ్రత్యము పాపము
పండిన పరిణామమిద్ది
కాడెద్దుల పెత్తనాల
కాలము మూడగనున్నది
ప్రత్యేక తెలంగాణము
ప్రాప్తి - ఒక్కటే ఒక్కటి
తెలంగాణ ప్రజల కోర్కె
తెలంగాణ ప్రత్యేకత
ప్రత్యేక తెలంగాణ
ప్రాప్తించే దాక ప్రజల
ఉద్యమం ఆగబోదు
ఉవ్వెత్తున లేచి సాగు
కోటిన్నర మేటి ప్రజల
గొంతొక్కటి, గొడవొక్కటి
తెలంగాణ వెలసి నిలచి
ఫలించాలె భారతాన
భారత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్
(1969-75 తెలంగాణ ఉద్యమ కవిత్వం నుంచి)












Click it and Unblock the Notifications