మృత్యుహేళ

ఒక వైపు నేను
మరో వైపు మృత్యువు
ఆడవలిసిన ఆటలో
ఓటమి ముందే నిర్ణయించబడింది
పెనవేసుకున్న బంధాల్లో
బోలు తనం ముందే తెలిసిపోయింది
తరుముకొస్తున్న మృత్యువుతో పేచీ లేదు
కలవని ఆలోచనల తీరాల మధ్య
కరిగిపోయిన కాలపు మంచుపూల వంతెన
ఘనీభవిస్తున్న దేహ సరస్సు
నడుస్తున్న చరిత్ర నాది కాదు
రానున్న చరిత్రలో నాకు చోటు లేదు
వేధిస్తున్న మృత్యువు వల్ల వేదన లేదు
జీవితం మండుటెండకు కరుగుతున్న చాకోబార్












Click it and Unblock the Notifications