పద్యంతో ప్రయాణం

నీళ్ల బాటిళ్ల మద్యాన్ని జుర్రుకుంటూ అతను
గుండెలో జాలువారుతున్న పద్యాన్ని సేవిస్తూ నేను
ఎంతో సేపు పట్టదు, అతను గురక పెడుతుంటడు
నేను మాత్రం పద్యాన్ని
మననం చేసుకుంటూ ఉంటా
ప్రాణమొచ్చి బస్సు పరుగులు తీస్తది
ఊళ్లూ పూళ్లూ
కొండలూ కోనలూ
అడవులూ పొలాలూ దాటతది
తెల్లారుతది, బస్సు ఆగుతది
అందరూ మేల్కొంటరు
నాకు నిద్రొస్తుంటది












Click it and Unblock the Notifications