ప్రేమ ఖైదీ

తెలుగు సేత: అమ్మంగి వేణుగోపాల్
నేనో ప్రేమ ఖైదీని
నాలుగు దిక్కులు, నాలుగు మూలలు
నీ స్వాధీనంలో ఉన్నాయి
ఈ అశాంతి, ఈ ఊపిరి సలపనీయని దుస్థితి
ప్రతిక్షణం నీ స్మరణం
ఇప్పుడిక విశ్వపు సంకెళ్ల నుండి విముక్తుణ్ని
ప్రేమలోని దిక్కు తోచని స్థితే
గమ్యస్థానపు చిరునామా చెప్తుంది
విరహ వేదనలోని సౌఖ్యరుచి
నా నాలుక మీద ఉందేమో మరి
సహజ ప్రేమ క్రమోల్మీనం కానీ
ఒకసారి ఒకే ఒక్కసారి
నా కన్నీటి ఆవేదనను తేలికపరుచు
పరిపక్వ ప్రణయ సంగమంతో పరిచయం కలిగించు












Click it and Unblock the Notifications