సముద్రం మీద చంద్రుడు

అందని జాంపండులా
దోబూచులాడుతున్నాడు చంద్రుడు
సముద్రం వంపుల మీద వన్నెల
వెన్నెల హర్షం కురిపిస్తున్నాడు
ఉవ్వెత్తున లేచిన అలకన్నె సిగలో
విరజాజులు తురుముతున్నాడు
మనసొడ్డిన ఇసక వాలున
మిసమిసల పిసళ్లతో
మమతాక్షర సంతకం చేస్తున్నాడు
తరంగ ఘోషను సూక్ష్మీకరించి
నాద వేణువు నింపుతున్నాడు
అలుపెరుగని కడలి కడవ
తొణికిసలాడిస్తోంది అలలెన్నిటినో
ఇన్నిన్ని తీరుల విరబూసిన అందాల ముంగిట్లో
నా మనసులో నాకు తోడుగా
పరవశించే నేస్తం
సముద్రం మీది చంద్రుడు












Click it and Unblock the Notifications