కవిత: ప్రయాణ గ్రహణం

చేరేసే వేగం వాహనంలో
మూకుమ్మడి నిర్ణయంగా
ప్రయాణ సమయం
అందరిలో ఒకే క్షణమై
పొడుస్తుంటే
జామ్ వెనకాల జామై
పొగల సెగల మంటల్లో
చెమటలు గుచ్చుకునే చిరాకుల్లో
తొందరపెట్టే బండి గంటల మోతల్లో
ఇరుకును విశాలం చేయలేని అహనంలో
కదులుతూ - కట్టుకొడుతూ
యంత్ర ఊపిరితో యాంత్రికంగా
పోతూ - వస్తూ
వస్తూ - పోతూ
గురుత్వాకర్షణ శక్తి నుండి
దేహాత్మ తెగిపోయి
నగర ప్రయాణ గ్రహంలో
తేలుతూ తిరిగే పాదంలో
ప్రయాణ గ్రహణం
- దుర్గాప్రసాద్ అవధానం












Click it and Unblock the Notifications