అన్నవరం కవిత ఆపతి సంపతి

మనస్సు మాటలు కలుపుతది
తెల్సిన వాళ్లయితే కరచాలన స్పర్శ
పాత స్నేహితుని గొంతు
వినీ వినగానే
విశాలమైన హృదయ వైశాల్యం
కాలనీ తరచూ కల్సుకునే
అపరిచయస్థుల కనుపాపల పలకరింపులు
స్నేహం చిక్కనైన కొద్దీ
పరస్పర నమస్కారాలు
మనిషంటే ముఖవర్చస్సు
లేదా పెదవుల మది చిరునవ్వు
మనిషి ఒక మాట ముచ్చట
మనుషులు లేని ఇల్లు ఓ ఇల్లేనా
పూలు ఫలాలు లేని తోట తోటేనా
మనిషే మనిషికి సోపతి
ఆపతి సంపతి
- అన్నవరం దేవేందర్












Click it and Unblock the Notifications