అంతరాత్మ సాక్షి

వింటి వెదురుబద్దని నేనేనని
నువ్వే
బాహాటంగా ప్రకటించినప్పుడల్లా
పసి పిల్లల ఆనందాన్నైనాను
వింటి నారి సారిస్తున్నప్పుడూ
నీ బొటనవేలును కూడా
నేనేనని
నువ్వంటూ వుంటే
అదే పసిప్రాయపు
అమాయకత్వాన్నైనాను
ఇప్పుడు మాత్రం నేనొక
నా వింటితో
నా బొటనవేలునే
నువ్వు తెగనరికిన
క్షతగాత్రున్ని
నా బొటనవేలుతోనే
నువ్వే
నా వింటి వెన్ను విరిచిన
నిశ్శబ్ద వేదనని
ఐతేనేం
విలుకాడే
విలువిద్యకు పర్యాయపదం












Click it and Unblock the Notifications