బాణాల కవిత మారని సిలబస్

శబ్దం కన్నా పదునైన
నిశ్శబ్దాన్ని మించిన నిశ్శబ్ద శబ్దం
మెదడును మెలిపెట్టే నిశ్శబ్దం
అమ్మ ఒడిలో పడుకొని
ఆకాశాన్ని తన్నుతున్న
పసిపాప కాళ్ల శబ్దం
నానార్థాల శబ్దం నిశ్శబ్దం
ఒక్కో పొరను వొలుచుకుంటూ
ఓ రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించే
అద్భుత నిశ్శబ్దం
గడ్డి పరక మీంచి జారి
భూమిని తాకే మంచు బిందువు చేసే నిశ్శబ్దం
నిశ్శబ్దాన్ని కౌగలించుకోవటం
శూన్యాన్ని పిడికిట్లో బిగించినంత మహాకార్యం
- బాణాల శ్రీనివాస రావు












Click it and Unblock the Notifications