తెహరీఖ్ బండ్

వాస్తవం చూడడానికి మంచిగుండదు
అది... విధ్వంసమే కావొచ్చు
ఒక విగ్రహం వెయ్యి పదాలకు సమానమై
పాతను తోడి, ప్రస్తుతాల్ని జోడించి
భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగపడాలి... కాని
అర్థాంగీకార మౌనంతో ఒక వైపే వకాల్తా పుచ్చుకుంటే
బద్దలు కొట్టకుండా ఎవారపగలరు
అవును - మీ వైతాళికులను పేర్సి మా వీరులను మర్సి
ఎగతాళి చేస్తే
మా పెన్నులు గడ్డపారలు, గూటం దెబ్బలే అవుతాయి మరి
ఆరు నూర్ల ఆత్మబలిదానాల ఆర్తనాదాలు తాకని మీకు
ఊపిరి లేని రూపాల క్షోభ విబడిందంటే
సాన్నిత్యంలో గురించి మీ అంతర్ముఖపు నెమరు
గతానికి భవిష్యత్తుకు సంబంధించి
సమాధానం లేని వేలవేల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి
అయినా కడుపుల లేనిది కావలించుకుంటే వస్తదా
నాలుగున్నర కోట్ల గుండెల్లో
స్తబ్దతను బద్దలు కొట్టడం
పిల్లిని బంధించాలని చూస్తే -
పెల్లుబుకి ఎగిసిన రూపం
తెహరీఖ్ స్కేర్ పోరు
విధ్వంసం అయితే ఇది విధ్వంసమే
అయినా - సంఘటనకా మీ బాధా
యారాలు నవ్వినందుకా
సమైక్య ఫోబియానా
అణచివేత హద్దులు దాటితే
నిగ్రహం కోల్పోయిన - వరదలో
విగ్రహాలే కాదు...
పొట్టకొట్టే మీ అగ్రహారాలు కూల్తాయ్ జాగ్రత్త
- గాదె వెంకటేష్












Click it and Unblock the Notifications