ఇష్టమేనా తెలంగాణ?

పిల్ల ఊహా విహంగమా
తోకకు దారం కట్టి
ఎగిరే స్వేచ్ఛనిస్తారట
సమ్మతమేనా?
తుమ్మిష్కా?
తొలి జలాంతర్గామా
తొలి గర్భసంచిని సముద్ర నివాసమా
మొప్పట కత్తిరించి
స్వేచ్ఛనిస్తారట
ఇష్టమేనా?
జలచరమా?
తొలి హెలికాప్టరా
పిల్లల ఊహాతరంగమా
రెక్కలు మడిచి
ఎగిరే ఉత్సవం చేస్తారట
రింగన్న సమ్మతమేనా?
క్షిపణి తొలి రూపమా
పిల్లల ఊహాపక్షమా
తోకకు రాయి కట్టి
ఎగరమంటూ
వాయిద్యాలతో ఎగురుతారట
నీకిష్టమేనా పతంగమా?
పోరుహోరు తెలంగాణమా
పోరు చెలిమి ఆది రూపమా
ప్రజాగ్రహ దివిటీ
హైదరాబాద్ లేని రాజ్యమిస్తారట
ఇష్టమేనా తెలంగాణ?
జెండా లేని వెదురుకర్ర
జీవంలేని వట్టి కట్టె
పొదుగు లేని జడల బఱ్ఱె
కర్రు లేని కటెట్ కోండ్ర
ఇష్టమేనా
తెలంగాణ?
ఇష్టమేనా?












Click it and Unblock the Notifications