తెలుగు కవిత 'రిక్తహస్తాల లోయ'

Durga Prasad poem 'Rikta Hasta La Loya'
కావాలిప్పుడు
ప్రపంచాన
స్త్రీపురుషుడికి మధ్య
ఏకాంతం
ఎవరి ప్రేమలో ఎవరు లేరు
ఎవరి పరిష్వంగంలో ఎవరు లేరు
ఎవరి ఒడి లాలనలో ఎవరు లేరు

రెండు పద్ధతుల స్పర్శలుగా
ఒకరిలోకి ఒకర
రెండు యుద్ధనీడలుగా
ఒకరి వ్యతిరేకంలోకి ఒకరు

కావాలిప్పుడు
స్త్రీపురుషుడికి మధ్య
శూన్యాతిశూన్యం

సమస్తమంతా సమాప్తమై
హింసలో పురుషుడు
సహనంలో స్త్రీ
పటాపంచలై
రహస్యాలు లేని
రాజకీయాలు లేని
ఆకాశంలో కదులుతున్న
పక్షికి రెండు రెక్కల్లా
భావార్థాలు లేని
ముఖంలో చరించే
రెండు కళ్లలా

ఇపుడు
ప్రపంచాన
స్త్రీపురుషుడికి మధ్య
అన్ని పరుగులు ఆగిపోవాలి
చూసే దిక్కులేని చూపుగా

దరిద్రాలు లేని
దుఖ్కాలు లేని
రక్తపాతాలు లేని
ఓ కాంతి విస్ఫోటన ద్యానం తరువాత
విలీనం మొత్తంలో
కాలం ఆగిపోవాలి

శాన్యాతి శూన్యంలో
సకల నిర్మాణాలు
కుప్పకూలిపోయి
రిక్తహస్తాల లోతుల్లో
గగనమెత్తు పరమానందంగా
అనుభవ ప్రాప్తిలో
తలమునకలవ్వాలి

- దుర్గాప్రసాద్ అవధానం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+