నా తెలంగాణ పాట

Nandini Sidha Reddy
నాగేటి చాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా
నవ్వేటి బతుకులు నా తెలంగాణా నా తెలంగాణా
పారేటి నీల్లల్ల - పానాదులల్ల
పూచేటి పువ్వుల్ల - పునాసలల్ల
కొంగు చాపిన నేల నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|

తగేడు పువ్వుల్లు - తంబాలమంతా
తీరొక్క రంగుల్ల - తీరిచీనా పువ్వు
బంగారు చీరలు బజారులన్నీ
బతుకమ్మ పండుగ - నా తెలంగాణా నా తెలంగాణా
బంతి పూలతోట - నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|

వరదగూడు గడితె వానొచ్చునంట
బురద పొలమూ దున్ని మురిసున్నరంతా
శివుని గుల్లె నీల్లు చీమలకు శక్కరి
వాన కొరకు భజన - జడకొప్పులేసి
వాగుల్ల వంకల్ల - నా తెలంగాణా నా తెలంగాణా
చూపు రాలిన కండ్లు - నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|

కొత్త బట్టల్లు గట్టి - కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి - పడుచు చప్పట్లు
జొన్న కర్రల జెండా - జోరున్నదేమి
అలయి బలయి దీసె - నా తెలంగాణా నా తెలంగాణా
జంబి పంచిన ఆర్తి - నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|

మోటగొట్టే రాత్రి - మోగీన పాట
తాడు పేనిన తండ్రి - తలుపులున్నప్పు
కల్లమూడ్సిన అవ్వ - కలలోని గింజ
ఆరుగాలం చెమట - నా తెలంగాణా నా తెలంగాణా
ఆకలిదప్పుల మంట - నా తెలంగాణ నా తెలంగాణా |నాగేటి|

ఊరు గాచే తల్లి ఉరిమి చూడంగ
బువ్వలేని తల్లి బోనమొండింది
సేనుకొచ్చిన పురుగు సెరిగిబోసిందా
బోనాల పండుగ - నా తెలంగాణ నా తెలంగాణా
కాట్రావుల ఆట - నా తెలంగాణా నా తెలంగాణా
శివసత్తుల ఆట - నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|

దట్టి గట్టిన రోజు దప్పు చప్పుల్లు
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
కుడుకపేర్ల మొక్కు కూలి బతుకుల్లు
ఆలువాడిన పాట - నా తెలంగాణా నా తెలంగాణా
ఆత్మగల్ల చెయ్యి - నా తెలంగాణా నా తెలంగాణా

కలిసేటి సేతుల్ల కన్నీటి పాట
సిందోల్ల సిందుల్ల సిగురించె నాట్యం
వొగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం
కళలకే పుట్టుకా - నా తెలంగాణా నా తెలంగాణా
పాటగాచిన పట్టు - నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|

తాడూ పేనిన తండ్రి తలుపులున్నప్పుడు
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
నీళ్లు లేని చెరువు నిను జూసి నవ్వె
బతికి చెడ్డా బిడ్డ - నా తెలంగాణ నా తెలంగాణా
తల్లడిల్లే తల్లి - నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|

బురుజు గోడల పొగరు మెడలు వంచంగ
గుట్టల్ల చెట్లల్ల గోగు పువ్వుల్లు
సద్ది మోపిన తల్లి సావు బతుకుల్ల
పానమిచ్చిన వీర కథలు బతుకంగ
గోరుకొయ్యల పొద్దు - నా తెలంగాణా నా తెలంగాణా
గోరువంకల సభలు - నా తెలంగాణా నా తెలంగాణా

- నందిని సిధారెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+