మెత్తనగాడు

Vajjala Shivakumar
అతడు కనిపిస్తూనే ఉన్నాడు చాలా కాలంగా
ఎలాగోలా అదేపనిగా అడ్డగోలుగా
వాక్యాలమీద వాక్యాలమీద వాచ్యమై వ్యాజ్యమై
తోక తొక్కిన ఉన్మాదమై
చాంతాడు పొడుగు పదాలజాతర్లో
తప్పిపోయిన తాపత్రయమై కనిపిస్తూనే ఉన్నాడు

ఏ అనివార్యతా కోరకుండానే
ఓ చారిత్రక అసందర్భంలా ఎదురుపడి
కొన్ని అయోమయాలను మూటగట్టుకొని
దిక్కూ మొక్కూ లేని దివాలాకొరు అంతరాత్మతో
కపట దిశా నిర్దేశం చేస్తున్నాడు

అందరూ పోరుదారిలో పోటెత్తుతున్న దశలో
చేతలనుంచి తప్పుకొంటూ
తన గాలివాటునే తిరుగుబాటుగా భ్రమపెడుతున్నాడు
నడిచేవాళ్ళను కంగారెత్తిస్తూ కలవరపరుస్తూ
ఎప్పుడూ ఏదో ఓకొత్త నినాదమై గాల్లో కలిసి పోతుంటాడు
రంగుతేలి వెలిసిపోతుంటాడు.

విద్రోహుల వైపునించి గొంతెక్కుపెట్టిన ‘పడమటిబాట' గాడు
మాటలని మార్కెట్ సరుకులుగా విక్రయించగల బేహారి
ఆటలో చేరినప్పుడే అవసరపూర్తి మర్యాదల మాటున
కొత్త విద్రోహాన్ని లోలో పెంచుకున్నవాడు
కాలాన్ని బాలనాగమ్మనుచేసి వెంట పెట్టుకు పోగల
మాయల మరాఠీ
సాగాల్సిన బాటనిండా అనుమానపు ముళ్ళు నాటడం ఓ నైజం
ఎవరి ప్రయోజనాలకోసమో నడకను నిర్వీర్యం చేయడం
ఉద్వేగాలను పక్కదారి పట్టించడం ఓ ఎత్తుగడ

ఇంక జాగ్రత్త
బయటి జాగిలాలనించే కాదు
లోపలి చీడ పీడలనించీ
పైరును కాపాడుకోవాల్సి ఉంది

ఇప్పుడు ఒక నిశ్చలనిశ్చయంలా బతకటం అంటే
గమ్యం పట్ల విశ్వాసాన్నీ
లక్ష్యం మీద గౌరవాన్నీ
అయిదో ప్రాణంగా పదిలపరుచుకోవటం
చెదరని సంకల్పమై కదిలిపోవటం

ఉద్యమంలో నడవడం అంటే
వెయ్యి కళ్ళ కాపలాతో కాలు కదిలించటం
వెయ్యికాళ్ళ సహకారంతో నడకను బతికించటం
లక్షల ఊపిర్ల ఊతమిచ్చి ఆత్మగౌరవానికి ఆయువు పోయటం.

- వఝల శివకుమార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+