గేయం: ప్రతిజ్ఞ చేద్దాం

A poem by Veludanda Nithyananda Rao
పల్లవి: అందరమూ మనసు పెట్టి ప్రతిన చేయుదాం.
వందనమిదె జననీ యని శిరసు వంచుదాం. //అందరమూ.....//

చరణం.1
అందరిదీ ఒక ఆత్మ, అందరిదీ ఒక హృదయం,
అందరిదీ ఒక లక్ష్యం, అందరిదీ ఒక గమ్యం
సమభావం, సౌజన్యం సాధించాలనీ
సంకుచితత్వం , స్వార్థం విడనాడాలనీ //అందరమూ.........//

చరణం . 2
సాముహిక అభ్యుదయం , వైజ్ఞానిక దృక్పధం
సర్వకళావైభవం సకల జనప్రాభవం
అణువణువున న్యాయం వికసించాలనీ
అడుగడుగున ధర్మం విలసిల్లాలనీ //అందరమూ......//

-ఆచార్య వెలుదండ నిత్యానందరావు
తెలుగుశాఖ, ఉస్మానియావిశ్వవిద్యాలయం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+