కవిత: గాయాలతో స్వేచ్చాగానం

Vemuganti Muralikrishna
నాగలి భుజమ్మీద పెట్టుకొని అడుగుతున్నాను
నిజాలే చెప్పమని

మట్టిని నువ్వు పుట్టించలేదు
నీళ్ళు మన భావనలకంటే పురాతనమైనవి
నాగరికత మూలాన్నిఎక్కిరించకండి

పదాలని నోట్లో పెట్టుకొని ప్రశ్నిస్తున్న
భాషకు ఆకారమెలాఉంటుందో గీసి చూపెట్టమని
అక్షరాలు విడిపోతే ఆనందాలు ఎలా
చెల్లా చెదురవుతాయో వివరించమని

నదులకు దుఃఖము తెలుసు
వెలుగులో పరవళ్ళు తొక్కడం తెలుసు
మనిషి పారుతున్న నీళ్ళలో విషంకక్కడం ప్రమాదకరం

ఇసుకతో పరాచకాలాడడం ఒక ఆధిపత్యం
మాటని పదిలంగా సద్దిమూటలా విప్పుతున్న మా గతమెక్కడ
బతుకులో కన్నీరు నింపుతున్న మీ కాలమెక్కడ

ఉమ్మడి ని'బంధనా'ల నుంచి ఎగిరిపోతున్న పావురాల గుంపులకు
వలలువేసే మీ చేతులు
స్వేచ్ఛను అడ్డుకోవడానికి ఎన్ని అంత్రాలైన ఎక్కుతవి
ఎన్ని కుతంత్రాలైనా చేస్తవి

- వేముగంటి మురళీకృష్ణ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+