కవిత: నవ్వు ముఖం

మంచు కరుగుతున్నట్టుంది
వేకువ వాగులా పొంగుతుంటే
భవనాలు మునిగిపోతున్నట్టుంది
గాలికి చెట్లు ఊగుతుంటే
పోస్టర్ల మీది హీరోయిన్లు
అభ్యంగ స్నానాలాడుతున్నట్టుంది
గగనంలో పక్షులు ఎగురుతుంటే
మువ్వలు ఘల్లుమన్నట్టుంది
ఉదయం నడకకు పులకించి
అల్లరిగా రోడ్లు అలికిడవుతుంటే
మొద్దు నిద్దుర పారిపోతున్నట్టుంది
ఆకాశం వేసుకొన్న
చుక్కల పరదాను జరిపి
అప్పుడప్పుడే నవ్వుముఖంతో
వెల్తురేదో తొంగి చూసినట్టుంది
- ఆశారాజు












Click it and Unblock the Notifications