తెలుగు కవిత: చివరి భోజనం

నరాల దిరిసెన తీగల్ని
నిర్దాక్షిణ్యంగా చిట్లించడం కోసం
నాణ్యమైన తాడు పేనడం వింత
రక్తదాహపు రాచక్రీడను
తెల్లని బట్టల్ని నిండారా తొడిగించి
రక్తి కట్టించడం నటన
కసాయిలా కుత్తుకను ఉత్తరించే ముందు
కమ్మని చివరి భోజనపు కన్నీళ్లను పెట్టించడం
అమానుష పరిహాసం

ఉరి
నేరం కన్నా
వికృత రూపం

దోషం జరిగే ఉండొచ్చు
తెలిసి పట్టినా
తెలియక ముట్టినా
నిప్పు కాలుతూనే ఉంటుందన్న
వివేచనకు అవకాశం లేని
విచిత్రమైన లోకంలో
దైన్యంగా చౌర్యం చేసిన
బాల్యముంటుంది
యవ్వనం చిక్కుముడి
విప్పడం అర్థం కాక
ఉద్రేకంగా బిగించిన
కౌమార్యం ఉంటుంది
ఆవేశం చానలైజ్ చేసుకోలేక
దారి తప్పిన ఉద్రేకాన్ని
ఉపయోగించుకునే
స్వదేశీ, విదేశీ మతలబు ఉంటుంది
అంతర్లనంగా
అంతర్జాతీయ రిమోట్ ఉంటుంది
మూలం
దృశ్యం కంటే భిన్నంగా ఉంటుంది

కాలంం వీచే గాలిలో
అప్పుడప్పుడు అంతు చిక్కని
విషవాయువులు దొర్లుతాయని
విద్వేషాలు రగుల్తాయని
జీవన్మరణ సంధిలో గాని
తెలియకుండా ఉంటుంది
ధ్వంసానికి మూలాలు
ఛేదించలేని దర్పాలు
శిక్షల మెలిపొరలను
సమర్థంగా కప్పుకుంటాయి

Anugu Narsimha Reddy's poem the last meal

నేరం వెనుక ఆకలి
ఘోరం వెనక కుట్ర
ఛేదించడం సులభం కాకపోవచ్చు
మన్నించరాని నేరాన్ని మన్నించి
ఆజన్మ బందీ చేయవచ్చు
లోకం నుండి ఐసోలేట్ చేసి
క్షణం క్షణం ఆత్మావలోకనం కలిగించవచ్చు
ఏ గీతనూ చదవకుండా
పండంటి జీవితాన్ని
పరిణతి దిశగా పయనింపజేయవచ్చు

జీవన వేదనలన్నీ
గుక్క పట్టిన సంవేదనం మరణం
ప్రకటన నుండే మొదలయ్యే నరకం
అత్యున్నత శిక్ష

ఇక జారిపోయిన బండి ఇరుసులా
చెదిరిపోయిన జ్ఞాపక శకలాలన్నీ
తలుచుకునే సమయం ఉండదు
తన్నుకుని దుఖ్కించడానికి
పరుచుకున్న తల్లి ఒడి ఉండదు
చెంపల మీద కాల్వల నీరు
తుడిచే ప్రియురాలి స్పర్శ ఉండదు
ఆడిన నేస్తం
పాడిన పరవశపు జ్ఞాపకమూ
చిన్ననాటి చందమామ
కలిమెలిగిన బుజ్జిమేక
ఊయలలూపిన కుక్కి మంచం దరికి రావు
దుఖ్కం
ఒంటరి దుఖ్కం
పంచుకోలేని నిర్వచించుకోలేని దుఖ్కం
నలువైపులా ఆవరించుకున్న
నల్లని రాతి గోడలకూ అలవి కాని దుఖ్కం
preplanned cruel murder
Resulted in capital punishment

కార్యం వెనుకనున్న కారణం
ఎవరికీ పట్టదు
క్షమాభిక్ష తిరస్కారం
ప్రాసిక్యూషన్ అభీష్టమే
ఏదైనా అమాయకత్వం కలిసిందా అన్న
వివేచన తెలయని తలారి
దుఖ్కంతోనే పని పూర్తి చేస్తాడు
రాజ్యం దర్పంగా ముందుకు నడుస్తుంది

దైవం మాత్రమే
విధించవలసిన శిక్ష అది
రాజుల చొరబాటును
ధిక్కరించవలసిందే
మరణశిక్ష
మధ్య యుగాల
రాక్షస దాహం
పగతో ఊగే
రాజ్యం దించే
ప్రకటిత గునపం

దాన్ని ఎదిరించవలసింందే

- ఏనుగు నరసింహా రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+