యోగమహిమ
యోగసాధన చేయుమమ్మా
దేహశక్తిని పెంచుకొమ్మా
దేహబలిమిని పెంచుకొనుచూ
దేశ స్వస్థతకు పాటుపడుమా
దేహమంటె బొజ్జ కాదోయ్
దేహమంటె మనోబలమోయ్
తిండిపైనను అదుపు పెట్టి
ఒడలుపైనను పట్టుగొనవోయ్

యోగసాధనమున మేను వంగును
మేనువంగిన మనసు లొంగును
మనసు లొంగిన స్తిమితమొచ్చును
స్తిమితమొచ్చిన ముదము హెచ్చును
భోగమిచ్చెడి హాయికన్న
యోగమిచ్చెడు శాంతి మిన్న
యోగసాధన చేయుమమ్మా
మనోశమనము పొందుమమ్మా
రచన: దాసు మధుసూదన రావు
మహాకవి గురజాడ బాణీలో వ్రాసిన ఈ కవితకు ప్రేరణనిచ్చినవారు మిత్రులు శ్రీ ఎమ్ బి బి యస్ ఆర్ శర్మ












Click it and Unblock the Notifications