సమాధులు కట్టుకుంటున్నాను

నిశ్శబ్ద నిర్జన నిశీథి రాత్రి
నిర్బంధ ఏకాంత నిరాశ చీకటులావరించిన రాత్రి
కాలం గర్భస్రావం చేసుకున్న శైతల్యపు నిశి రాత్రి
మౌనంగా గడ్డ కట్టి మనస్సుని పుచ్చకాయలా కోస్తున్న నిర్జల కంటక రాత్రి
దయచేసి నన్నెవరూ కదపకండి
నేనిప్పుడు సమాధులు కట్టుకుంటున్నాను -

చెదిరిపోయిన భగ్న స్వప్నాలకు
వదిలి వెళ్లిన దగ్ధ బంధాలకు
మరకలుగా మిగిలిన ఇంకిన నెత్తుటికి
జ్ఞాపకంగా గడ్డకట్టిన చెమరిన కన్నీటికి
సమాధులు కట్టుకుంటున్నాను
నన్నెవరూ కదపకండి-

Dr Kasula Linga Reddy

ఆశయాల మరుభూములు మింగేసిన మౌనపు ఆశలకు
చీకటి సంద్రంలో దిక్సూచి పోగొట్టుకున్న చిలుపడిన నావలకు
స్వయంగా తోడుండలేని ఐశ్వర్యాధారిత ప్రేమలకు
మారని దూరాలతో, చేరలేని గమ్యాలతో
నిలబడ్డ చోటే పరుగులు పెడుతున్న ప్రభాత విభ్రాంత పలవరింతలకు
తారలు లేరని గుండె పగిలి
ఆకాశపు ఉరికొయ్య మీద వేలాడుతున్న జాబిల్లికి
సమాధులు కట్టుకుంటున్నాను
గడ్డకట్టిన మానస సరోవరంలో రాయి విసిరి
కదల్చాలని చూడకండి -

చేయని నేరాలకు విధించబడ్డ శిక్షల వ్రణబాధలకు
చేసిన తప్పులకు మోపబడ్డ మృణగాధలకు
ఆరని చూపుల పిపాసలకు
తీరని కోర్కెల మండుతున్న కొలుములకు
చిదిమి దీపం పెట్టుకునే సౌందర్యం చుట్టూ
తిరిగి తిరిగి కాలి బూడిదైన యౌవన శలభాలకు
పాలీసైథీమియా రోగి ఆకాశం మీద కక్కుకున్న రక్తంలాంటి
ఈ సూర్యుడికి
సమాధులు కట్టుకుంటున్నాను
నన్నెవరూ కదపకండి -

శ్మశానపు మునివాకిట
దింపుడు గళ్లం ఆశలతో డిస్టర్బ్ చేయకండి -

డాక్టర్ కాసుల లింగా రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+