కవిస్వరం: నాగరాజు కవిత

కవిత్వంలో మార్మికత, తాత్వికత కలగలసిపోయి, ఓ అమూర్త భావనను నాగరాజు తన చేపలు కవితలో కళ్లకు కట్టారు. ఓ తాత్విక చింతన, పుట్టుకలోని వేదన చేపలు కవితలో దర్సనమిస్తుంది. ఏ అధ్యాత్మిక చింతనను నాగరాజు వ్యక్తీకరించాడనేది చెప్పడం కాస్తా కష్టమైన పనే. కానీ, కవిత మాత్రం హృదయంలో ఓ జీవితానికి సంబంధించిన తాత్వికతను గూడు కట్టేలా చేసింది.

నాగరాజు వాడిన ప్రతీకలు కవితకు సాంద్రతను చేకూర్చి పెట్టాయి. "ఆదిలో ఆమె నిడుపాటి వేలి కొసలను/ తనకలుగా కత్తిరించి నీటిలో పదిలినప్పుడు" అంటూ "ఒక్కొక్కటీ ఒక్కో చేపగా మారి/ సన్నని జీరలుగా ఎరుపిపింకిపోతూ అల్లిబిల్లి కదలికలతో కలసి ఆడుతుండేవి" అవే చేపలుగా మారాయని నాగరాజు అంటున్నాడు. ఆమె వేలి కొసల రూపం, చేప రూపాన్ని తలపిస్తుంది. చేపట కదిలికను కూడా అల్లిబిల్లి అంటూ వ్యక్తీకరించాడు.

సృష్టి పుట్టుకలో వేదన ఉందని కూడా చెబుతాడు. నెత్తురు కలగలసిన భయంకరమైన బాధే అయినా తన దేహంలో దేహమే కదా/మాలిమితో కూడిన ప్రేమ కదా అని అంటూ అందులోని ప్రేమ భావనను కూడా వ్యక్తీకరించాడు. మొత్తంగా, స్త్రీ సృష్టి ఆవిర్భావానికి పడే తపనను, వేదనను కవి తన కవితలో వ్యక్తీకరించాడు.

- కాసుల ప్రతాపరెడ్డి

Kavisangamam: Nagaraju poem on fishes

చేపలు

ఆదిలో ఆమె నిడుపాటి వేలి కొసలను
తునకలుగా కత్తిరించి నీటిలో వదిలినప్పుడు

ఒక్కొక్కటీ ఒక్కో చిన్ని చేపగా మారి
సన్నని జీరలుగా ఎరుపింకిపోతూ అల్లిబిల్లి కదలికలతో కలసి ఆడుతుండేవి

నెత్తురు కలగలసిన భయంకరమైన బాధే అయినా తన దేహంలో దేహమే కదా
మాలిమితో కూడిన ప్రేమ కదా

ఏమి పేరు పెడదాం వీటికీ?
అని ఆమె అనుకుంటుంది

చుట్టూ ఇసుక తుఫానులాంటి నల్లని పరదాలు కమ్ముకొస్తున్న జాములలో
తనతో తాను మాటాడుకుంటున్నంటుగా
ఖండితమయి మోడువారిన చిన్ని కొమ్మల్లాంటి తన వేళ్ళను చూసుకుంటూ
ఇవి భయం, పాపం, దేవుడు, శాపం, చావు -

తను ఇంకెవరితోనో మరో స్త్రీతో, ఒక స్త్రీ మరొక స్త్రీ మాత్రమే చెప్పగలిగినంత లోగొంతుకతో ఒక మంంత్రోచ్చారణలా భాషిస్తూ వాటిని దోసిళ్ళలోనికెత్తుకొని
తన ఉమ్మనీటిలో పొదువుకొంటుంది

నెత్తుటి ప్రవాహ గతిలో ప్రాణవాయువును కొద్దికొద్దిగా తోడి
ఒక్కో గుక్కా పాలులా పట్టిస్తుంది

చేపలు పెరుగుతాయి

పెరిగి పెరిగి పెరగడమే తమ వ్యాపకమై విలయంలాగా మరణ సదృశమైన మహా ఆక్రమణలాగా
అవి పెరుగుతాయి

ముందుగావాటిని ఆమె చిన్ని తొట్టిలో ఉంచుతుంది
ఆ తరువాత ఒక వాగులో ఆ తరువాత నదిలో

అంతకంతకూ పెరుగుతున్న ఆ చేపలు
ఏ రోజుకారోజు తమ చోటు ఎక్కడాని అడుగుతూనే ఉంటాయి

చివరకు ఒకింత విసుగుతో
సన్నగ కంపితమవుతున్న దేహముతో ఆమె అంటుంది కదా

ఇదిగో ఆకాశమయి విస్తరించి సముద్రపు లోతులుగా తొణకిసలాడే ఈ దేహపు గూడు
ఇక వచ్చి చేరండి -

అనాది గాధను నిదురలేపే డగ్గుత్తికతో
ఒక స్త్రీ తనలాంటి మరొకరితో వెతుకులాటులో తడబడుతూ మోకరిల్లే శరణు కోరికలాగా
పదే పదే భయం, పాపం, దేవుడు, శాపం, చావులను చెప్పడాన్నితొలిసారి విన్నప్పుడు
నీ దేహంలో సన్నని ప్రకంపన

- ఎ.నాగరాజు
19-04-2014

https://www.facebook.com/groups/kavisangamam/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+