కవిస్వరం: రాళ్లబండి శశీశ్రీ కవిత

నిజానికి, రాళ్లబండి శశిశ్రీ కవితకు వ్యాఖ్యానం అవసరం లేదు. ఆమె కవిత పేరునే నో కామెంట్‌గా పెట్టారు. మనుషుల ప్రవర్తనలోని కృత్రిమత్వాన్ని ఆమె వ్యంగ్యాత్మకంగా ఈ కవితలో చిత్రీకరించారు. బయటకు ఉపదేశాలు చేస్తూ, సూక్తులు వినిపిస్తూ, మనిషి ఉండాల్సిన పద్ధతి గురించి ఉపన్యాసాలు ఇస్తూ సాగే ఆధునిక వాచాలత్వాన్ని ఆసరా చేసుకుని, మనిషి వ్యక్తిత్వంలోని వైరుధ్యాలను కవి ఎత్తి చూపారు.

అనేక గందరగోళాల మధ్య గతితప్పిన ఆలోచనలతో/ జీవన సమతుల్యత గురించి మాట్లాడుతూ ఉంటావు అనే రెండు చరణాలకు వ్యాఖ్యానం అవసరం లేదు. ఆధునిక మానవుడి ప్రవర్తనలోని కృత్రిమత్వాన్ని, వైరుధ్యాన్ని ఆమె పాఠకులకు చేరే విధంగా ఆవిష్కరించారు.

Kavisangamam poet: Sasi Sri's No comment

కృత్రిమత్వం కూడా బాగానే ఉంటుంది అంటూనే వాటిని వెక్కిరించి, అవహేళన చేసే పద్ధతిని తర్వాతి చరణాల్లో ఆమె ఎంచుకున్నారు. చివరి వాక్యం ఈ కవితకు ప్రాణం. ఇప్పుడు సహజత్వం గురించి నేను మాట్లాడటమే అసంబద్ధంగా అనిపిస్తుంది అని ముగింపు ఇస్తారు. అంటే, కృత్రిమత్వం సహజమైందిగా ముందుకు వస్తూ సహజత్వాన్ని పట్టించుకోని వాతావరణం, సామాజిక పరిస్థితులు వచ్చి చేరాయి. ఇక దాని గురించి మాట్లాడడం నిజంగానే అసంబద్ధం కదా... కవిత సరళంగా ఉన్నప్పటికీ సృజనాత్మకత కారణంగా, భావనల కారణంగా మంచి కవితగా రూపు దిద్దుకుంది.

- కాసుల ప్రతాపరెడ్డి

నో కామెంట్!

నువ్వెప్పుడూ అసంబద్ధంగానే వ్యవహరిస్తుంటావు
మనుషుల మధ్య జరిగే ఆకర్షణ వికర్షణలకు అనుపాతాలు చేర్చి
అసంపూర్తి సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూనే ఉంటావు.

అనేక గందరగోళాల మధ్య గతితప్పిన ఆలోచనలతో
జీవన సమతుల్యతను గురించి మాట్లాడుతూ ఉంటావు

మనసులో సరిహద్దులు నిర్మించుకుని, మాటల్లో విశాలతను చాటి
డొల్లతనంలో రాటుతేలిన నీ వ్యక్తిత్వాన్ని నలుగురికీ చాటుతూ ఉంటావు.

అయితేనేం?!
కృత్రిమత్వం కూడా బాగానే ఉంటుంది
కాస్మెటిక్ సర్జరీలో మెరుగులు దిద్దుకున్న ముఖమంత అందంగా-
ఎయిర్ కండిషన్ డ్ గదిలో సేదతీరుతున్నంత హాయిగా-
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో స్నేహం చేస్తున్నంత ఆనందంగా-

ఇప్పుడు సహజత్వం గురించి నేను మాట్లాడటమే అసంబద్ధంగా అనిపిస్తోంది!

- రాళ్లబండి శశిశ్రీ
26-6-2014

కవిసంగమం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+