తెలుగు కవిత: నేన్చీకటి..
కల
ఓ సుదీర్ఘ నిద్రని కంటూ..!
రాత్రి
వలసెల్లిపోయింది
వెలుతురు కాన్పులో
అజ్ఞాత కన్నీళ్ళ
ప్రసవం

మాట
ఒంటరి పాదమై
నెత్తుటి
కొన ఊపిర్లతో
సంభాషణ
వెర్రికేక
వేలిడిచి ఆలోచనా..!
ధడేల్మని తెరుచుకున్న
తలుపు చాటుకు
వేకువ..
- శ్రీనివాస్ సాహి












Click it and Unblock the Notifications