సాహిర్ భారతి కవిత: ప్రయత్నం
కను చూపు మేరలో మసకగా కనిపించే కలని
కనుక్కుంధామన్న నా ఆశకు
అడుగడుగునా మల్లె పూలలో ముళ్ళు అలంకరించి
ఏ గుమ్మం తొక్కినా నా అడుగుకి స్థానం లేదంది
ఏ తలుపును తట్టినా నా ముఖంపై చీదరించుకుంది
ఏ చూపుకి నా ఆశని పరిచయం చేద్దామన్నా
ఆ చూపు నన్ను వెలివేసింది

నా రెక్కలు విరిచినా
నా అడుగులని కట్టడి చేసినా
నా దారిని మూసివేసినా
నా మనసుని అదుపు చేసినా
నా కనులు కునుకు తీయడానికి ఆలోచించేలా చేసినా
ఆఖరి క్షణం వరకు ఓటమిని అంగీకరించను
నా పోరాటానికి సెలవు పలకను












Click it and Unblock the Notifications