సాహిర్ భారతి ప్రశ్న-2
ఒంటరితనంతో గుసగుసలాడినప్పుడు .....
నా గుండె పలికిన పదాలు..
భాధను భరించే వాడికే భాద్యతను అంటకడుతాడేమో.....
వెన్ను చూపని మనిషిని
వేరే వాళ్ళకి ఉదాహరణ అవడం కోసం పుట్టిస్తాడేమో.....
నలుగురికి నీతో అన్నం పెట్టించడానికి

నీ కడుపు మాడ్చి ఆకలి విలువను తెలుపుతున్నాడేమో.....
చెమట కరిగించకుండా
కన్నీటిని రాల్చకుండా
దక్కిన దానిపై విలువ ఉండదని
నీ సంకల్పాన్ని పరిశీలిస్తున్నాడేమో.....
నీ ఇంటి ఇటుకలని గట్టి చేయడానికి
ఇంటి విలువని తెలుపుతున్నాడేమో.....
నలుగురి సంతోషం గురించి తలిచే వాడికి
నాలుగు క్షణాల సంతోషం ఏదో ఒక చోట దాచి పెట్టుంటాడేమో.......
- సాహిర్ భారతి












Click it and Unblock the Notifications