వలపుల సంద్రం: శ్రీస్వర్ణ కవిత

Sree Swarna's Telugu poem
సాగరతీరంలో నీ చెంత ఆలపించిన గాత్రమాధుర్యానికి దేవశంఖాలన్నీ నాదాలు చేయడం ..అద్భుతమే !

నీవు జార్చిన నవ్వుల్ని ఒడిసిపట్టి ఆల్చిప్పలన్నీ స్వాతిముత్యాలకి మెరుగులు పెట్టడం ..అద్భుతమే !
నీ పాదాల్ని తాకిన ..ప్రతి నీటిబిందువు తమదే భాగ్యమని పరవశించడం ..అద్భుతమే !
నీ తీపి గుసగుసలు విని.. నాతొ పాటు తరంగాలు సైతం సిగ్గుతో తలవాల్చడం ..అద్భుతమే !
నీ స్వరమాధుర్యాన్ని విని సంద్రం పరుగుపరుగున ముందుకి రావడం ..అద్భుతమే !
నీ స్నిగ్ధసౌందర్యానికి మెచ్చి సముద్రుడు ..పాలనురగలతో అభిషేకించడం ..అద్భుతమే !
శీతల సమీరాలు సైతం పరిమళాల వాన కురిపించడం ...అద్భుతమే !
నీ పాదముద్రల స్పర్శకు పులకరించిన రేణువులు..ఇసుక సౌధాలు కట్టి నీ రాక కోసం వేచి చూడడం ..అత్యద్భుతమే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+