తెలుగు కవిత: పలాయన వాదం
పక్క ఇల్లు కాలుతోంది
పోదాం పారిపోదాం
కనిపించనంతగా
వినిపించనంతగా ....
చెంబుడు నీళ్ళు కాదు కదా
చెంచాడు నీళ్ళు కూడా కాదు
కళ్ళు కూడా చేమరించనంత
దూరం పోదాం
ఎక్కడికి వెళదాం మిత్రమా
ఎంత దూరం వెళదాం
ప్రశ్నిచు కున్నవా ప్రశించుకున్నావా ఏనాడు అయినా ..?
ఈ దేశం మనది
ఈ రాష్ట్రం మనది
ఈ జిల్లా మనది
ఈ ఊరు మనది
ఈ కుటుంబం మనది
ఈ దేశంలోని కుటుంబాలను
మన అసమర్ధతకి వదిలి
వీరులమనో, శూరులమనో
నా దేశం గొప్పదంటూ,
చచ్చేదాకా పారిపోదాము
చావులోంచి అయినా రోశపు మొక్కలు
మొలకెత్తెదాకా పారిపోదాం
-లక్ష్మి ఒర్సు

తెలుగు కవయిత్రి లక్ష్మి ఒర్సు తన అస్తిత్వాం భారత దేశంలోనే ఉందని తన కవిత పలాయనవాదం ద్వారా చాటుకుంటున్నారు. వన్ ఇండియాలో కవిత మీ కోసం....












Click it and Unblock the Notifications