తెలుగు కవిత: రాఖీ
ఎర్రపొడిలో కలిసె పసుపు గింజలతోటి
గిన్నెలో కర్పూర తెలుపుతోటి
ఏ చేతికెప్పుడు ఎన్నిముల్లాడతాయో
మనికట్టులో దాగు కనికట్టునడుగు
ఆకాంక్షలన్నీ అక్షింతలవుతుంటే
ఆనంద సమయాల ఆషాఢమాసంలో
కర్పూరమెందుకని కన్నీళ్లు రాల్చిందో
కాళ్ళనే తాకేటి చేతినడుగు

రంగులా హరివిల్లు తానమాడిన యట్టి
ముడివేయు బందాల దారాలలో
మణిపూస మాటల్లో మనుసులున్నారని
మెల్లగా పున్నమితో చెప్పి చూడు
కాశి రాజు.
9542012144












Click it and Unblock the Notifications