తెలుగు కవిత: రావొచ్చు...

హంతకులు ఎవరికోసమన్నా రావొచ్చు,నిన్న తనకొరకు,ఇవాళ నాకొరకు

హంతకులు ఎవరికోసమన్నా రావొచ్చు
నిన్న తనకొరకు
ఇవాళ నాకొరకు
రేపు నీకొరకే కావొచ్చు

నచ్చనివాళ్ళని చంపుకతినుడు
నచ్చినపని వాళ్ళకు
వాడు వద్దన్న తిండితిన్నారని ఒకసారి
వాడు నమ్మిన అబద్ధాల్ని నమ్ముత లేరని ఒకసారి
వానికి నచ్చినట్లు మాట్లాడ్తలేరని లేదని అన్నిసార్లు
వానికి అవసరమైన బానిసల్లెక్క పడివుంట లేరని ప్రతిసారి
భయపెట్టేతందుకే మందమీద మెకంలెక్క దుంకుతడు
గాలిచ్చి మరీ ప్రాణాలు తీస్తడు

 A Telugu poem by S Haragopal

వానిగ్గూడ తెలుసు
అధికారం కోసమే మతాన్ని ప్రచారపు సరుకు చేసుకున్నరని
భక్తికాదు,పాడుకాదు,విశ్వాసం అంతకంటేకాదు
ఒక్క ఒరలో దేవుడు,దయ్యం రెండు కత్తులు

ప్రశ్నలంటే భయం
ఎందుకంటే తనకు తెలిసిన జవాబులే లెవ్వు
శ్రమంటే భయం
ఎందుకంటే సోమరిగా బతికేటందుకే దొంగవేషాలు
మనుషులంటే భయం
ఎందుకంటే తను మనిషినని ఎరుకేలేదు వానికి

-ఎస్.హరగోపాల్
9949498698

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+