కవిత: ఐనా నేనెగుస్తాను

వక్రీకరించిన నీ కఠోరమైన అబద్దాలతో
నువ్వు నన్ను చరిత్రలో పాతరేస్తేనేమి
ఆ రొంపిలోనే నువ్వు నన్ను
నీ పాదాలకింద నలిపివేస్తేనేమి
ఆ ధూళిలోనుంచే నేనెగుస్తాను

by reddy

వెటకారాల నా దురుసుతనం
నిన్నొక క్లేశ మతిని చేస్తున్నదా
నిన్ను విషాదమేదో ఆవహించినట్లున్నదేమి
నా విశ్రమ నివాసంలోనుంచి వెల్లువెత్తుతున్న
చమురు బావులేవో నాలో నిక్షిప్తమైనట్లు
నేను నడుస్తుంటాను కనుకనా

చందమామలవలె సూర్యబింబాలవలె
నింగికెగిసే ఆశలవలె
అదుపులేని కడలి తరగలవలె
నేనెగుస్తాను

నువ్వు నన్నొక తలవొగ్గిన
కండ్లు నేలకు వాల్చిన
దుఃఖితగా చూడాలనుకొంటివా
అథొముఖంగా జారిపడుతున్న
కన్నీళ్ళ బిందువులవలె
నా భుజాలు కృంగిపోతున్న నన్ను
నువ్వొక దుఃఖితగా చూడాలనుకొంటివా
నువ్వు నన్నొక
గుండెలోతులనుంచి ఉబికిన ఆక్రందనల్లో
శక్తి హీనమైన
దుఃఖితగా చూడాలనుకొంటివా

పొగరెక్కిన నా గడుసుతనం
నిన్ను భంగపరుస్తున్నదా
నా యింటి పెరటి లోపల ఏవో
బంగారు గనుల తవ్వకాలున్నట్లు నేను
పగలబడి నవ్వుతాను కనుక నీకదొక
కొరకుడుపడని కొయ్య అనిపించవొచ్చు

నువ్వు నన్ను నీ వెకిలి మాటలతో
గాయపరిస్తేనేమి
నీ చూపులతో నువ్వు నన్ను
ఖండఖండాలుగా నరికివేస్తేనేమి

నీ ద్వేషాగ్నితో నువ్వు నన్ను
హతమారిస్తేనేమి
వీచే గాలిలో నేనెగుస్తాను

నా ప్రాయపు ఆడతనం
నిన్నొక వికృత మతిని చేస్తున్నదా
నా తొడలు రొండేకమయే చోట
వజ్రాల సంపదొకటి గుప్తమై వున్నట్లు
నేనాడుతుండడం నీకొక
ఆశ్చర్యార్థకమవుతున్నదా

తలవంపుల చరిత్ర కుటీరాలనుంచి
నేనెగుస్తాను
వ్యధల్లొ నిగూఢమైవున్న గతంలోనుంచి
నేనెగుస్తాను

కదం తొక్కుతూ విశాలంగా పరుచుకొస్తున్న
నేనొక నల్ల సముద్రాన్ని
ఎగజిమ్మిన వెల్లువైన
నేనొక ఉప్పెనకు గర్భస్థాన్ని

భయానకమైన కాళరాత్రుల మీదినుంచి
ఒకానొక ముగ్ధమనోహర ఉదయాకాశంలోనికి
నేనెగుస్తాను

నా తరాల వారసత్వం నాకందిచ్చిన
కానుకల్ని వెంటమోసుకొని వొస్తున్న నేనొక
బానిసత్వం కలలుగన్న స్వప్నాన్ని
నేనొక బానిసత్వం ఆశపడ్డ స్వప్నాన్ని

ఇంగ్లీషు మూలం: మాయా ఏంజెలో రచన Still I Rise
అనువాదం: బైరెడ్డి కృష్ణారెడ్డి
[email protected]

మొబైల్: 9440072211

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+