నాసా భారీ ప్రయోగం

నాసా అత్యంత ప్రతిష్ఠాత్మక ఆర్టెమిస్ 2 మిషన్‌కు సిద్ధమవుతోంది. 54 ఏళ్ల తర్వాత మానవులను చంద్రునికి సమీపంలోకి తీసుకెళ్లే ఈ మిషన్‌ను 2026 ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగిస్తారు. నలుగురు వ్యోమగాములు ఓరియన్ క్యాప్సూల్‌లో భారీ ఎస్ఎల్ఎస్ రాకెట్‌తో అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున 4 గంటలకు ఈ రాకెట్ చంద్రుడి వైపు దూసుకెళ్తుంది.

సుమారు 10 రోజుల పాటు ఈ రాకెట్ చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసి భూమికి చేరుతుంది. చంద్రునిపై ల్యాండింగ్ ఉండదు. భూమికి అత్యంత దూరం ప్రయాణించడం, అత్యంత వేగంగా తిరిగి రావడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఆర్టెమిస్ 2 వ్యోమగాములు భూమి నుండి సుమారు 4,02,000 కిలోమీటర్లు ప్రయాణించి అత్యధిక దూరాన్ని చేరుకుంటారు. ఇది అపోలో 13 మిషన్ కంటే 2,414 కిలోమీటర్లు ఎక్కువ. ఈ మిషన్ ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ విధానంలో సాగుతుంది.

Artemis 2 Set to Push the Moon Mission Forward by NASA A Historic Moment Space Travel After Apollo13

చంద్రుని వైపు నుండి రాకెట్ బూస్టర్లను మండించకుండానే తిరిగి భూమికి రావడం దీని ప్రత్యేకత. చంద్రుని కక్ష్యలోకి వెళ్ళేటప్పుడు 50 నిమిషాల పాటు రేడియో కనెక్టివిటీ ఉండదు. ఈ మిషన్‌లో వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చేటప్పుడు గంటకు 40, 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అపోలో 10 రికార్డును బద్దలు కొడతారు. ఓరియన్ క్యాప్సూల్ హీట్ షీల్డ్ ఈ ఉష్ణాన్ని తట్టుకోగలదని నాసా పేర్కొంది. ఈ వ్యోమగాములు చరిత్రలోనే అత్యంత వేగంగా ప్రయాణించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు.

ఈ మిషన్ కు కేప్టెన్ పైలట్ విక్టర్ గ్లోవర్. చంద్రుడి సమీపంలోకి వెళ్ళిన మొదటి నల్లజాతి వ్యోమగామి ఆయనే. గతంలో స్పేస్ స్టేషన్‌కు వెళ్ళొచ్చిన ఆయన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌ను పైలట్ చేసిన మొదటి వ్యక్తి కూడా. ఆర్టెమిస్ 2లో గ్లోవర్ ఓరియన్ క్యాప్సూల్‌ను కొంత సమయం పాటు మాన్యువల్‌గా నియంత్రిస్తారు. మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్ లియో పరిధిని దాటి చంద్రుని సమీపంలోకి వెళ్ళిన మొదటి మహిళ కానున్నారు. ఆమె 328 రోజులు స్పేస్ స్టేషన్‌లో గడిపి రికార్డు నెలకొల్పారు.

ఆల్ ఫిమేల్ స్పేస్‌వాక్ లో కూడా పాల్గొన్నారు. ప్రయోగించిన 40 నిమిషాల తర్వాత ఆమె జెరెమీ హన్సెన్‌లతో కలిసి లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు.కెనడియన్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హన్సెన్ చంద్రుని సమీపానికి వెళ్ళిన మొదటి అమెరికన్ కాని వ్యోమగామి. ఇది ఆయన మొదటి అంతరిక్ష ప్రయాణం. 50 ఏళ్ల కమాండర్ రీడ్ వైస్‌మాన్ చంద్రునికి సమీపంలోకి వెళ్ళిన అత్యంత పెద్ద వయస్సున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పుతారు.

అపోలో 14లో 47 ఏళ్ల అలన్ షెపర్డ్‌కు ఈ రికార్డు ఉండేది. బృందంలోని గ్లోవర్, హన్సెన్‌లు షెపర్డ్‌ కంటే పెద్దవారు కాగా కోచ్ 72 రోజులు చిన్నవారు. ఇది ఎస్ఎల్ఎస్ రాకెట్ మొదటి క్రూ బేస్డ్ మిషన్. ఓరియన్ క్యాప్సూల్‌ను మానవులతో మొదటిసారి పరీక్షించనున్నారు. భవిష్యత్ లో చంద్రుడిపై స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆర్టెమిస్ 2 చంద్రుడి వద్దకు వెళ్లిరావడానికి మాత్రమే పరిమితం కావట్లేదు. భవిష్యత్తులో చంద్రునిపై ల్యాండింగ్, దీర్ఘకాల నివాసం కోసం ఆర్టెమిస్ 3, ఆర్టెమిస్ 4 మిషన్లకు పునాది వేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+