11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్
ఓ చిరు ప్రాణి. దీని బరువు ఓ 300 గ్రాముల వరకు ఉంటుంది. శాస్త్రీయ నామం బార్-టెయిల్డ్ గాడ్‌విట్. సింపుల్ గాబీ6 బర్డ్ అని పిలుస్తుంటారు. ఇది తాజాగా వార్తల్లోకెక్కింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం- అమెరికాలో ఎక్కడో మారుమూల ఉండే అలస్కాలోని కుస్కోక్విమ్ డెల్టా నుండి ఆస్ట్రేలియాలోని టాస్మానియా వరకు నాన్ స్టాప్ గా ప్రయాణించింది. ఎక్కడా ఆగలేదు. సప్తసముద్రాలను అలవోకగా దాటేసింది.
11 రోజుల్లో 13,560 కిలోమీటర్ల ప్రయాణం..
అలస్కా డెల్టా నుండి టాస్మానియా వరకు మధ్య దూరం సుమారు 13,560 కిలోమీటర్లు. ఈ దూరాన్ని 11 రోజుల్లోనే అధిగమించిందంటే దాని వేగం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరంతరాయ వలస జీవిగా దీని గిన్నిస్ రికార్డుకెక్కింది. ఈ బర్డ్ నాన్ స్టాప్ జర్నీని శాస్త్రీయంగా లెక్కగట్టారు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు. దీనికి సోలార్ ట్యాగ్‌ను అమర్చారు. దీని సహాయంతో ప్రయాణాన్ని ట్రాక్ చేశారు. బీ6 11 రోజులు ఏమీ తినకుండా, తాగకుండా, విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా ప్రయాణం సాగించింది.

రుతువులకు అనుగుణంగా వలస..
బార్-టెయిల్డ్ గాడ్‌విట్.. సముద్రపు పక్షి. రుతువులకు అనుగుణంగా వలస వెళ్తుంటుంది. సుదీర్ఘ ప్రయాణానికి ముందు ఇది తన శరీరాన్ని అనువుగా మార్చుకుంటుంది. వలసకు కొన్ని వారాల ముందు, ఇది విపరీతంగా ఆహారం తీసుకుంటుంది. శరీరంలో కొవ్వును భారీగా నిల్వ చేసుకుంటుంది. బరువు రెట్టింపు చేసుకుంటుంది. అంతర్గత అవయవాలను కుదించుకుంటుంది. కడుపు, ప్రేగులు, కాలేయం 55 శాతం వరకు చిన్నవిగా మారుతాయి.
శరీరంలో కొవ్వు నిల్వ.. అదే ఆహారం
ప్రయాణ సమయంలో ఇది ఎక్కడే గానీ ఆహారం తీసుకోనందు వల్ల వీటిని కుదించుకోవడం దానికి అవసరం. ప్రయాణానికి ముందు ఎక్కువగా తినడం వల్ల ఏర్పడే కొవ్వును నిల్వ చేసుకుంటుంది. అందులో నుంచే ఎగరడానికి అవసరమైన శక్తి, నీటిని ఉత్పత్తి చేసుకుంటుంది. ఇలా ఈ గాడ్ విట్ బర్డ్ తన కడుపునే అనుకూలంగా మార్చుకుంటుంది. బరువు తగ్గిన తర్వాత తేలికపడి ప్రయాణం మొదలుపెడుతుంది.
తినదు, తాగదు, నిద్రపోదు..
11 రోజుల నిరంతరాయ ప్రయాణంలో ఈ పక్షి తినదు, తాగదు, నిద్రపోదు. మెదడుకు విశ్రాంతి అవసరం. కాబట్టి ఎగురుతూనే మగతగా నిద్రపోతుంది. దీనిని 'యూనిహెమిస్ఫెరిక్ స్లో-వేవ్ స్లీప్' అంటారు. ఈ ప్రక్రియలో ఒక కన్ను తెరిచే ఉంటుంది. మెదడులో సగం భాగం నిద్రపోగా, మిగిలిన సగం మేల్కొని ఉంటుంది. ఎగురుతూనే ఒక కన్ను విశ్రాంతి తీసుకోగా, మరొకటి దారి చూపిస్తుంది. ఇలా ప్రయాణంలోనే మార్చి మార్చి విశ్రాంతి తీసుకుంటుంది.
క్వాంటం మెకానిజం ద్వారా..
తన ప్రయాణ దిశానిర్దేశానికి భూ అయస్కాంత క్షేత్రాన్ని ఆధారంగా తీసుకుంటుంది. ఈ పక్షి కళ్ళలో ఉండే క్వాంటం మెకానిజం ద్వారా అయస్కాంత రేఖలను ఇది గుర్తిస్తుంది. నక్షత్రాలు, సూర్యుడు, గాలి పీడనం, వాతావరణ మార్పుల ఆధారంగా దారిని కచ్చితంగా నిర్ణయించుకుంటుంది. ఇది పాత జీపీఎస్ కన్నా ఎంతో మెరుగైనది. అలస్కాలో వేసవిలో పుష్కలంగా ఆహారం, ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో శీతాకాలంలో సురక్షిత ఆశ్రయం లభిస్తుందని ఈ బర్డ్ భావించడం వల్లే క్లిష్టమైన ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏ మాత్రం బెదరదీ బర్డ్..
మహాసముద్రాల మీదుగా ఏకధాటిగా ప్రయాణం అత్యంత క్లిష్టతరం. కింద భూమి ఉండదు. ఎక్కడైనా విశ్రమించాలన్నా ఎటువంటి ఆధారం దొరకదు. తుఫానులు, సుడులు తిరిగే సముద్రపు గాలులు, తీవ్రమైన చలి, అదే స్థాయిలో వేడిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కొన్నిసార్లు గాలి వ్యతిరేక దిశలో వీయడం వల్ల ప్రయాణం మరింత కష్టతరమవుతుంది. అయినప్పటికీ- వీటికి ఏ మాత్రం బెదరదీ బర్డ్. వేల సంవత్సరాలుగా ఈ పక్షి ఇదే మార్గంలో వలస వెళ్తుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications