పాకిస్థాన్, చైనా కు బిగ్ షాక్.. ప్రళయ్ మిసైల్ వచ్చేస్తోంది..!
సాలిడ్ ప్రొపెల్లెంట్, క్వాజీ బాలిస్టిక్ మిసైల్స్ ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఈ పరీక్షల్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. ఈ క్షిపణుల్ని DRDO అభివృద్ధి చేసింది. డిసెంబర్ 31 న ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో ఈ పరీక్షలు నిర్వహించగా విజయవంతం అయినట్లు.. ఈ మిషన్ లక్ష్యాలను అందుకున్నట్లు DRDO అధికారులు వెల్లడించారు.
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO).. తాజాగా ప్రళయ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలోని ప్రయోగ కేంద్రంలో నిర్వహించగా, విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ రెండు క్షిపణులు పరీక్షల సమయంలో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో మోహరించిన ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును ధృవీకరించామని అన్నారు.
Salvo lunch of two Pralay Missile in quick succession from same launcher were successfully conducted today from ITR, Chandipur. The flight test was conducted as part of User evaluation trials. Both the missiles followed the intended trajectory meeting all flight objectives. pic.twitter.com/QeJYVDhL1l
— DRDO (@DRDO_India) December 31, 2025
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవని తెలిపారు. ఈ మిసైల్స్ పేలోడ్ కెపాసిటీ 500 కిలోల నుంచి 1000 కిలోలు ఉంటుందని వివరించారు. మరోవైపు ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంతో DRDO శాస్త్రవేత్తలను రక్షణశాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ అభినందించారు.

ఇక ఈ ప్రళయ్ క్షిపణి.. అత్యాధునిక నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో పనిచేస్తుంది. వివిధ రకాల వార్ హెడ్ లను మోసుకెళ్తూ శత్రువుల స్థావరాలపై విరుచుకుపడగలిగే సత్తా ఈ ప్రళయ్ క్షిపణుల సొంతం. ఈ మేరకు హైదరాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)తో పాటుగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వంటి సంస్థల సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. ఇక త్వరలోనే ప్రళయ్ క్షిపణులు సైన్యంలో చేరనున్నాయి. ఈ మిసైల్స్ ను పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా ప్రయోగించనున్నారు.నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ వద్ద ప్రళయ్ మిస్సైల్ ను మోహరించే ఛాన్స్ ఉంది. దీంతో దాయాది దేశాలైన పాకిస్థాన్, చైనాలకు ఇదో షాక్ అని చెప్పొచ్చు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications