బయటపడ్డ రహస్య ప్రపంచం, 7 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లు!

కాలయంత్రంలో వెనక్కి వెళ్తే.. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిని ఏలిన రాక్షస బల్లుల సామ్రాజ్యం ఎలా ఉండేదో కళ్ళకు కట్టే ఒక అద్భుత దృశ్యం ఇప్పుడు వెలుగుచూసింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని మేజ్ (Meze) ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఏకంగా 100కి పైగా డైనోసార్ గుడ్లతో కూడిన భారీ గూడు బయటపడింది. సుమారు 7 కోట్ల ఏళ్ల పాటు భూగర్భంలో నిగూఢంగా దాగి ఉన్న ఈ నిధి, డైనోసార్ల అంతిమ కాలానికి (క్రిటేషియస్ యుగం) సంబంధించిన కీలక రహస్యాలను ప్రపంచానికి చాటిచెబుతోంది.

బేజియర్స్ - మోంట్‌పెల్లియర్ నగరాల మధ్య సాగుతున్న ఈ తవ్వకాలు తొలుత సాధారణంగానే ప్రారంభమైనా.. తర్వాత అది భూమి పొరల్లో దాగి ఉన్న వింతైన మెరుపు గా కనిపించింది. ఇదే శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ప్రసిద్ధ శాస్త్రవేత్త అలేన్ కాబోట్ నేతృత్వంలోని బృందం అన్వేషణలో, కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే వందలాది గుడ్లు ఒకేచోట లభ్యం కావడంతో ఇది అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ శిలాజాల పొర ఇంకా విస్తరించి ఉండటంతో చుట్టుపక్కల మరిన్ని విస్మయకర ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Giant Dinosaur Nest with 100 Eggs Found in France Rare Cretaceous Fossils Reveal Ancient Mysteries

అప్పట్లో అది ఒక ఉష్ణమండల స్వర్గం!

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. 70 నుంచి 72 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నదులతో నిండిన ఒక ఉష్ణమండల మైదానంగా ఉండేది. డైనోసార్లకు ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశం.

పొదిగే పద్ధతి..

డైనోసార్‌లు నిస్సారమైన గోతులు తవ్వి, అందులో గుడ్లు పెట్టి వృక్షజాలంతో కప్పి ఉంచేవారు. కుళ్ళిపోతున్న ఆ మొక్కల వేడితోనే ఈ గుడ్లు పొదిగేవని పరిశోధకులు వివరిస్తున్నారు. నాటి ఋతుపవన వరదలు ఈ గూళ్ళను త్వరగా మట్టితో పూడ్చిపెట్టడం వల్లే, లక్షలాది సంవత్సరాలు గడిచినా ఇవి చెక్కుచెదరకుండా భద్రంగా ఉన్నాయి.

టైటానోసార్ల నుంచి అంకిలోసార్ల వరకు..

ఇక్కడ దొరికిన గుడ్లలో అత్యధికం భారీ శాకాహారులైన టైటానోసార్ జాతికి చెందినవి. అయితే, వీటితో పాటు అంకిలోసార్‌లు, చిన్న థెరోపాడ్‌ల గుడ్లు కూడా లభించడం విశేషం. అంటే, వేర్వేరు జాతులకు చెందిన డైనోసార్‌లు పదేపదే ఈ ప్రాంతానికే వచ్చి గుడ్లు పెట్టేవని దీనివల్ల స్పష్టమవుతోంది. గతంలో ఇక్కడ 7 సెంటీమీటర్ల పొడవున్న అరుదైన చిన్న గుడ్లతో పాటు, విలక్షణమైన దేహ కవచం కలిగిన కొత్త అంకిలోసార్ జాతిని కూడా గుర్తించారు.

శిలాజాల రక్షణకు ప్రత్యేక మ్యూజియం..

గతంలో ఈ ప్రాంతం నుండి విలువైన శిలాజాలను అక్రమంగా తరలించే ప్రయత్నాలు జరగడంతో, ఇప్పుడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ చారిత్రక ప్రదేశంపైనే ఒక ప్రత్యేక మ్యూసీ-పార్క్ డెస్ డైనోసార్స్ మ్యూజియాన్ని నిర్మించారు. విశేషమేమిటంటే, సందర్శకులు ఇక్కడికి వచ్చి శాస్త్రవేత్తలు జరుపుతున్న లైవ్ తవ్వకాలను స్వయంగా వీక్షించవచ్చు. మాయమైపోయిన ఒక మహాయుగాన్ని కళ్లకు కట్టే ఈ పరిశోధనలు, జీవ పరిణామ క్రమంపై మన అవగాహనను మరింత విస్తరిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+