6300mAh భారీ బ్యాటరీతో POCO C85x 5G.. కేవలం రూ.10,999కే !!
నేటి కాలంలో అందరి చేతిలోనూ సెల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే "పోకో" భారత్ లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. POCO C85x 5Gను చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Poco భారత మార్కెట్‌లో మార్చి 10, 2026న అధికారికంగా విడుదల చేసింది.
కాగా గత ఏడాది వచ్చిన POCO C85 మోడల్‌కు ఇది సక్సెసర్‌గా మార్కెట్‌లోకి వచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర ₹10,999గా నిర్ణయించారు. తక్కువ ధరలో 5G సపోర్ట్, పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, మొదటిసారి 5G ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్‌గా నిలవొచ్చని చెబుతున్నారు.

POCO C85x 5G ఫీచర్స్..
భారీ డిస్‌ప్లే..
POCO C85x 5Gలో 6.9 అంగుళాల పెద్ద HD+ డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీక్షణ మరింత స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్‌కు TÜV Rheinland Low Blue Light మరియు Flicker Free సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువసేపు మొబైల్ వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T8300 (6nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సాధారణ వినియోగం, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమింగ్ వంటి పనులకు ఈ చిప్‌సెట్ సరిపోతుంది. గ్రాఫిక్స్ పనితీరును మెరుగుపరచడానికి Arm Mali-G57 MC2 GPUను ఇందులో చేర్చారు.
ర్యామ్&స్టోరేజ్..
POCO C85x 5Gలో 4GB LPDDR4X ర్యామ్ అందించారు. స్టోరేజ్ విషయంలో రెండు వేరియంట్లు ఉన్నాయి:
4GB + 64GB
4GB + 128GB
మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. దీంతో ఫోటోలు, వీడియోలు, యాప్స్‌ను ఎక్కువగా నిల్వ చేసుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్..
ఈ ఫోన్ Android 16 ఆధారిత Xiaomi HyperOSపై పనిచేస్తుంది. యూజర్ ఇంటర్‌ఫేస్ సులభంగా ఉండేలా కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసింది.
కెమెరా..
ఫోటోగ్రఫీ కోసం POCO C85x 5G వెనుక భాగంలో 32MP ప్రైమరీ కెమెరాను అందించారు. దీని వెంట ఒక సెకండరీ కెమెరా కూడా ఉంది. AI ఫీచర్లతో ఫోటోలు మెరుగైన క్వాలిటీతో తీసుకునే అవకాశం ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 6300mAh భారీ బ్యాటరీను ఇచ్చారు. దీని ద్వారా సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. అలానే 15W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఉంది. దీంతో ఇతర డివైజ్‌లను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.
ధర & లభ్యత..
4GB + 64GB - ₹10,999
4GB + 128GB - ₹11,999
ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 14 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Flipkartలో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది.
రంగులు..
POCO C85x 5G మూడు రంగుల్లో అందుబాటులోకి వస్తోంది:
బ్లాక్
గోల్డ్
గ్రీన్
ఇతర ఫీచర్లు..
సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్
ఫేస్ అన్‌లాక్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
FM రేడియో
డ్యూయల్ SIM 5G సపోర్ట్
బ్లూటూత్, Wi-Fi కనెక్టివిటీ
మొత్తంగా తక్కువ ధరలో 5G కనెక్టివిటీ, పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో POCO C85x 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications