రూ.17 కోట్లు గెలుచుకునే ఆఫర్ ఇస్తున్న "యాపిల్"..!
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. అత్యంత క్లిష్టమైన, కీలకమైన సైబర్ లోపాలను గుర్తించిన పరిశోధకులకు $2 మిలియన్ల (రూ.17.7 కోట్లు) వరకు రివార్డు ఇవ్వనుంది. ఈ ప్రకటనతో సైబర్ సెక్యూరిటీ విషయంలో సంస్థ మరోసారి తన దృఢ సంకల్పాన్ని చాటుకుందని స్పష్టం అవుతోంది. ఈ మేరకు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ వంటి ఉత్పత్తుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి.. కంపెనీ ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను భారీ రివార్డుతో అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది.
సెక్యూరిటీకి యాపిల్ ప్రాధాన్యత..
కాగా యాపిల్ ఎప్పటినుంచో సైబర్ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. తన ఉత్పత్తులలో కనుగొనబడే లోపాలు, బగ్‌లు, హ్యాకింగ్ అవకాశాలను గుర్తించి నివేదించే వారికి బహుమతులు అందజేస్తుంది. ఈ విధానం ద్వారా కంపెనీ ఉత్పత్తులు, సర్వీసులు మరింత భద్రంగా మారతాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తరహా ప్రోగ్రామ్ లను గూగుల్, సామ్ సంగ్ వంటి ఇతర సంస్థలు కూడా ఫాలో అవుతున్నాయి. కానీ యాపిల్ వాటన్నింటికంటే ముందుకు దూసుకెళ్తుంది.

రివార్డు..
యాపిల్ ప్రకటించిన కొత్త స్కీమ్ ప్రకారం.. ఈ రివార్డు ముఖ్యంగా జీరో-క్లిక్ హ్యాక్‌లు, ఎక్స్‌ప్లాయిట్ చైన్‌లు, స్పైవేర్ ఇన్‌ఫెక్షన్‌లను గుర్తించిన వారికి ఉద్దేశించబడింది. ఇది ఇప్పటివరకు యాపిల్ చరిత్రలో ప్రకటించిన అతిపెద్ద బగ్ బౌంటీగా చెబుతున్నారు. కాగా యాపిల్ సెక్యూరిటీ ఫీచర్లలో ఒకటైన "లాక్‌డౌన్ మోడ్"ను బైపాస్ చేసే లోపాలను గుర్తించిన వారికి $1.5 మిలియన్ వరకు రివార్డులు పెంచింది.
అలాగే బీటా వెర్షన్లలో బగ్‌లను గుర్తించిన వారికి కూడా ప్రత్యేక బోనస్‌లు ఇవ్వనుంది. ఈ బోనస్‌లతో కలిపి మొత్తం రివార్డు $5 మిలియన్లు (రూ.43 కోట్లు) దాటే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
ఎథికల్ హ్యాకర్లకు కొత్త అవకాశాలు..
ఈ కొత్త బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎథికల్ హ్యాకర్లు, సెక్యూరిటీ పరిశోధకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఉంది. పరిశోధకులు ఒక బృందంగా కలిసి పనిచేస్తే, జట్టు స్థాయి రివార్డులు కూడా పొందవచ్చు. యాపిల్ ప్రకారం ఈ ప్రోగ్రామ్ "సైబర్ ముప్పులను ముందుగానే గుర్తించి వాటిని నియంత్రించడమే" లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాకుండా 2025 నవంబర్‌లో తన బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టనుంది. ఈ మార్పుల వివరాలు యాపిల్ సెక్యూరిటీ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి.
ఇక 2020లో ప్రారంభమైన ఈ యాపిల్ పబ్లిక్ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీ ఇప్పటికే $35 మిలియన్లు (₹300 కోట్లకు పైగా) రివార్డులు చెల్లించింది. 800 మందికి పైగా పరిశోధకులు ఇప్పటివరకు బహుమతులు అందుకున్నారు. కొందరు పరిశోధకులు ఒక్క బగ్‌కే $500,000 (₹4.3 కోట్లు) వరకూ పొందారు. ఈ కొత్త బగ్ బౌంటీ అప్‌డేట్‌లు యాపిల్ సైబర్ సెక్యూరిటీ వైపు తీసుకుంటున్న దీర్ఘకాలిక వ్యూహాత్మక దిశకు సూచికగా వివరిస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications