c0c0n 2025 : అతిపెద్ద సైబర్‌సెక్యూరిటీ సదస్సుకు టైమ్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ !
భారతదేశంలోనే అతిపెద్ద సైబర్‌సెక్యూరిటీ సదస్సుకు టైమ్ ఫిక్స్ అయ్యింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపదుతున్న " c0c0n 2025 " సదస్సును అక్టోబరు 10, 11 తేదీలలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో ఈ కార్యక్రమం జరగనుంది. కాగా ఈ ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం చేశారు. సైబర్‌సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్, ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంచేందుకు ఇది కీలక వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ప్రీ-కాన్స్‌ఫరెన్స్ హ్యాండ్..
ప్రధాన సదస్సుకు ముందు అక్టోబరు 7, 8, 9 తేదీలలో ప్రపంచ సైబర్‌సెక్యూరిటీ నిపుణులచే ప్రత్యేక హ్యాండ్-ఆన్ శిక్షణా సెషన్లు నిర్వహించబడతాయని స్పష్టం చేశారు. ఈ సెషన్లలో పాల్గొనేవారు అధునాతన సైబర్ డిఫెన్స్ టెక్నిక్స్ పై ప్రాక్టికల్ అనుభవాన్ని పొందగలరని చెబుతున్నారు.

c0c0n 2025లో ప్రధానంగా AI-ఆధారిత సైబర్‌దాడులు, ర్యాన్సమ్‌వేర్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రమాదాలు సహా ఇతర వర్థమాన సైబర్ బెదిరింపులపై దృష్టి సారించనున్నారు. AI ఆధారిత దాడులు, RaaS (Ransomware-as-a-Service), రాష్ట్ర ప్రాయోజిత హ్యాకింగ్, డీప్‌ఫేక్ తప్పుడు సమాచారం వంటి సవాళ్లను విశ్లేషించడం ద్వారా సైబర్‌సెక్యూరిటీ భవిష్యత్తును చర్చించే వేదికగా c0c0n 2025 నిలవనుంది.
కీలక అంశాలు..
ఈ సదస్సులో అనేక కీలక అంశాలపై చర్చలు జరుగనున్నాయి. వాటిలో..
-
AI & సైబర్‌దాడులు
-
ర్యాన్సమ్‌వేర్ పరిణామాలు
-
క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రమాదాలు
-
డీప్‌ఫేక్స్ & ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్
-
క్లౌడ్ & IoT సెక్యూరిటీ
-
సప్లై చైన్ దాడులు
-
డిజిటల్ ఫోరెన్సిక్స్ & ఇన్సిడెంట్ రెస్పాన్స్
పరిశ్రమల కోసం ప్రత్యేక సెషన్లు..
అంతే కాకుండా ఈ సదస్సులో బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI), ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ & ఫార్మా, విద్య & పరిశోధనా సంస్థలు, తయారీ, ఆటోమొబైల్స్, ఆయిల్ & గ్యాస్, రిటైల్, ఇ-కామర్స్, మీడియా, ప్రభుత్వ విభాగాలు వంటి రంగాల కోసం ప్రత్యేక నివారణ వ్యూహాలు, సెక్యూరిటీ మార్గదర్శకాలు, కాబ్యాబుల్ ప్రాక్టికల్ సూచనలు అందించబడతాయని అంటున్నారు.
ఇక ఈ c0c0n 2025లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సైబర్‌సెక్యూరిటీ నిపుణులు, వైట్-హ్యాట్ హ్యాకర్లు, దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
c0c0n చరిత్ర..
c0c0n 2008లో కొచ్చి నగర పోలీస్ కమీషనర్ నేతృత్వంలో ప్రారంభమై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సైబర్ డిఫెన్స్ ప్లాట్‌ఫామ్గా అభివృద్ధి చెందింది. గత 18 సంవత్సరాలలో సైబర్‌డోమ్, డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ ప్రివెన్షన్ సెంటర్ లాంటివి ప్రారంభించడానికి ఉపకరించింది.
c0c0n 2025ను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ (ISRA) మరియు కేరళ పోలీసులు సంయుక్తంగా, ప్రముఖ ప్రపంచ సైబర్‌సెక్యూరిటీ సంస్థలతో కలసి నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనడానికి, రిజిస్ట్రేషన్ మరియు వివరాలకు https://c0c0n.org/ ను సందర్శించవచ్చు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications